శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (14:01 IST)

మనుషుల్ని కూడా లెక్కచేయరా.. 12కి.మీ అలా లాక్కెళ్లిన కారు.. చివరికి?

crime scene
మనుషులను లెక్కచేయకుండా వాహనదారులు లాక్కెళ్తున్న ఘటనలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుజరాత్ లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి సాగర్ పాటిల్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన భార్య అశ్విని బెన్ తో కలిసి బైకుపై వెళ్తున్నాడు. 
 
కడోదరా-బర్దోలి రోడ్డుపై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు వీరి బైకును ఢీకొంది. ఈ ఘటనలో అశ్వినిబెన్ రోడ్డుపై దూరంగా పడిపోయింది. కానీ బైకు నడుపుతున్న సాగర్ మాత్రం కనిపించలేదు. అతడు కారు కింద చిక్కుకున్నాడు. డ్రైవర్ మాత్రం ఆపలేదు. 
 
అలానే కారును ఆపకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. అలా కారు అతడిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. దీంతో కారు కింద చిక్కుకున్న సాగర్ పాటిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతడి మృతదేహాన్ని ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో, కమ్రేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.