శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (14:45 IST)

వేశ్యతో శృంగారం చేస్తూ మితిమీరిన కామోద్రేకంతో విటుడు మృతి... ఎక్కడ?

సాధారణంగా చాలా మంది పురుషులకు కామోద్రం అధికంగా ఉంటుంది. ఇది కొందరిలో మితిమీరిన స్థాయిలో ఉంటుంది. ఇది ఓ హద్దు దాటితే విషాదానికి దారితీస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి వేశ్యతో శృంగారం చేస్తూ మితిమీరిన కామోద్రేకానికి లోనయ్యాడు. ఫలితంగా శృంగారం చేస్తూనే స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత బెడ్‌మీద ఒరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆఫ్రికా ఖండంలోని మాలవి దేశంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాల‌వి దేశానికి చెందిన 35 ఏళ్ల చార్లెస్ మ‌జ‌వా అనే వ్యక్తి ఓ వేశ్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఇద్ద‌రూ మంచి అనుభూతిని పొందుతుండ‌గా.. చార్లెస్ మితిమీరిన కామోద్రేకానికి గుర‌య్యాడు. శృంగారం చేస్తూనే స్పృహ కోల్పోయాడు. 
 
అలా బెడ్ మీద ఒరిగిపోయాడు. కాసేప‌టికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని వేశ్య త‌న స్నేహితురాలికి చేరవేసింది. ఆ త‌ర్వాత పోలీసుల‌కు స‌మాచారం అందించగా, వారు వ‌చ్చి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
చార్లెస్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఇందులో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. చార్లెస్ శృంగార చ‌ర్య‌లో బాగా లీన‌మై మితిమీరిన కామోద్రేకానికి గుర‌య్యాడు. దాంతో అత‌ని నాడీ వ్య‌వస్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపి, మెద‌డులోని ర‌క్త నాళాలు చిట్లిపోవ‌డంతో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది. చార్లెస్ మృతితో వేశ్య‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, ఆమెపై కేసు న‌మోదు చేయ‌లేద‌ని పోలీసులు తెలిపారు.