గురువారం, 3 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (14:48 IST)

సోదరిని హత్య చేసి.. అవయవాలను చెత్తకుండీలో విసిరేసిన అన్నయ్య..

ఇటాలీ రాజధాని రోమ్ నగరంలో ఓ సోదరుడు తన సోదరి పట్ల రాక్షసుడిగా మారాడు. సోదరిని హతమార్చి.. ఆమె అవయవాలను ముక్కలు ముక్కలుగా నరికి చెత్తకుండీలో పారేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.

ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఓ సోదరుడు తన సోదరి పట్ల రాక్షసుడిగా మారాడు. సోదరిని హతమార్చి.. ఆమె అవయవాలను ముక్కలు ముక్కలుగా నరికి చెత్తకుండీలో పారేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 62ఏళ్ల ఓ వ్యక్తి.. 59 ఏళ్ల తన సోదరిని హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె అవయవాలను ముక్కలు ముక్కలుగా నరికి చెత్తకుండీలో వేశాడు. 
 
అయితే చెత్తకుండీలో మానవ అవయవాలుండటాన్ని చూసి షాకైన స్థానిక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెత్తకుండీలో నరకబడిన ఓ మహిళ తల వున్నట్లు గమనించారు. ఆపై పక్కనున్న చెత్తకుండీల్లో మరికొన్ని అవయవాలుండటాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు మెరిసియోను అరెస్టు చేశారు. 
 
విచారణలో తాను హత్య చేశానని మెరిజియో అంగీకరించాడు. హత్యకు గురైన మహిళ (నికొలెట్టా) తన సోదరి అని తెలిపాడు. అయితే సోదరిని సోదరుడే ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని పోలీసులు బయటికి చెప్పట్లేదు.