బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (18:44 IST)

వామ్మో.. రక్తాన్నీ పీల్చే జలగల్ని కూడా అక్రమంగా తరలించాడు..

బంగారం, వెండి, డ్రగ్స్ వంటివి అక్రమంగా సరఫరా చేయడం వినేవుంటాం. కానీ పురుగులను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అక్రమంగా తరలించడం విన్నారా... అయితే ఇది తప్పకుండా చదవండి. 


కెనడా నుంచి రష్యాకు పురుగులను తరలించిన వ్యక్తిని విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి తరలించేవి మామూలు పురుగులు కాదండోయ్.. రక్తాన్ని పీల్చే జలగలు. 
 
ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఇబోలిట్ అనే వ్యక్తి కెనడాలోని టోరంటో ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి రష్యాకు బయల్దేరాడు.

వెళ్తూ వెళ్తూ చేతిలో ఓ సంచితో విమానాశ్రయానికి వెళ్లాడు. అనుమానం పేరిట విమానాశ్రయంలో అధికారులు అతని సంచిని తీసి చూసి ఆశ్చర్యపోయారు. 
 
అతని సంచిలో ఏడు ప్లాస్టిక్ కవర్లలో దాదాపు 4వేలకు పైగా జలగలు వుండటం చూసి షాకయ్యారు. జలగల్లో కొన్ని రకాలను కెనడా నుంచి రష్యాకు తరలించాలని అతడు ప్లాన్ చేశాడు.

అవి మానవ రక్తాన్ని అతి సులభంగా పీల్చేస్తాయి. అతని వద్ద విమానాశ్రయ పోలీసులు జరిపిన విచారణలో.. పరిశోధన కోసం వాటిని రష్యాకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.