శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (15:40 IST)

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 56 వాహనాల ఢీ.. 17 మంది మృతి.. 37 మందికి గాయాలు

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 56 వాహనాలు ఒకటినొకటి వరుసగా ఢీకొనడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37మంది గాయపడ్డారు. షాంగ్జీ రాష్ట్రంలోని కున్‌మింగ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో చోటుచేసుకున

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 56 వాహనాలు ఒకటినొకటి వరుసగా ఢీకొనడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37మంది గాయపడ్డారు. షాంగ్జీ రాష్ట్రంలోని కున్‌మింగ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో చోటుచేసుకున్న ఈ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 
 
బీజింగ్‌ను కున్‌మింగ్‌తో కలిపే ఈ హైవేలో భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ హైవేపై మంచుతో కూడిన వర్షం పడటంతో దారి కనిపించక కొన్ని వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా ఈ విషయాన్ని వెనుక వస్తున్న వాహన దారులు గమనించలేకపోయారు. దీంతో, వరుసగా 56 వాహనాలు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాదం ద్వారా హైవేపై రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సహాయక సిబ్బంది వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. భారీ క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురయిన వాహనాలను తొలగించారు. వైద్యులు సంఘటనా స్థలానికే చేరుకుని చికిత్స అందిస్తున్నారు.
 
ఇకపోతే.. ప్రతి ఏడాది 200,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ హెల్త్ ఆర్గనిజేషన్ వెల్లడించింది. అతి వేగంతో రోడ్డు ప్రమాదాలు సాధారణమైపోయాయని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చైనా సర్కారు చర్యలు తీసుకుంటున్నా.. ఓవర్ లోడ్‌లతో కూడిన ట్రక్కులతో ప్రమాదాలు జరుగుతూనే వున్నాయని అధికారులు చెప్తున్నారు.