ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 22 మే 2019 (14:04 IST)

విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి శృంగారంలో మునిగిపోయాడు..

అతడు అమెరికాకు చెందిన 53 ఏళ్ల స్టీఫెన్ బ్రాడ్లీ మెల్ ధనవంతుడు. ఇతనికి ముగ్గురు  పిల్లలున్నారు. సమాజంలో అతనికి చాలా మంచి పేరు ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతూ పేదల పాలిట పెన్నిధిగా పేరు పొందారు. స్వంతంగా విమానాలు కొని, వాటిని పేదల అవసరాల నిమిత్తం ఉచితంగా ఇస్తూ ‘ఎయిర్ లైఫ్ లైన్’ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. 
 
ఒకవైపు స్వచ్ఛంద సేవ చేస్తూనే మరోవైపు ఇదిగో తలతిక్క పని చేశాడు. అది కూడా విమానం గాల్లో ఉండగా ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి మరీ 15 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేశాడు. బాలిక తల్లి తన కుమార్తెకు ప్లైయింగ్ పాఠాలు నేర్పించమని ఒక వ్యాపార వేత్తను కోరింది. అది కాస్తా స్టీఫెన్‌కు చేరడంతో దాన్ని ఆసరగా తీసుకొని అతగాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అతడి బుద్ది వక్రించింది. తన ప్రైవేట్ జెట్ విమానంలో సోమర్ సెట్ నుంచి బ్రాంస్టేబుల్ వరకు ప్రయాణించిన స్టీఫెన్ తిరుగు ప్రయాణంలో విమానాన్ని ఆటోపైలెట్ మోడ్‌లో పెట్టి శృంగారంలో మునిగిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్టీఫెన్‌ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. 
 
ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ స్టీఫెన్ తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌కు సంఘంలో చాలా మంచి పేరు ఉందని, అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని అతనికి క్షమాభిక్ష విధించాలని అభ్యర్థిస్తున్నాడు.