సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (14:41 IST)

బంగ్లాదేశ్ నటి రైమా దారుణ హత్య.. మిస్సింగ్ ఘటన విషాదాంతం

Raima
బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. గత రెండు రోజులుగా రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆ దేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కడమ్‌తోలి ప్రాంతంలో అలీపూర్ బ్రిడ్జి వద్ద ఒక గన్నీ బ్యాగ్‌లో రైమా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్ఎస్ఎమ్‌సి ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై విచారణ చేపట్టారు. 
 
నటి మరణంపై ముందు నుంచి ఆమె భర్త షాఖావత్ అలీను అనుమానిస్తున్న పోలీసులు మంగళవారం అతన్ని, అతని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైమా శరీరంపై కత్తిపోట్లు, ఇతర గాయాలను గుర్తించిన పోలీసులు, ఆమెను కిరాయి హంతకులు హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా 1998లో బర్తమాన్ అనే చిత్రం ద్వారా సినీ ప్రవేశం చేసిన రైమా ఇస్లాం, జాతీయ స్థాయిలో 25 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. పలు బంగ్లా సీరియళ్ళలోనూ నటించిన రైమా, మరికొన్నిటికి నిర్మాతగానూ వ్యవహరించారు. రైమా ఇస్లాం హత్య వెనుక ఆస్తి, నగదు లావాదేవీ వ్యవహారాలు ఉండి ఉంటాయని కేసు దర్యాప్తు చేస్తున్న కాలాబగన్ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో అసోసియేట్ మెంబర్‌గా ఉన్నారు.