శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (12:39 IST)

27 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్ వైరస్

monkeypox
నిన్నామొన్నటివరకు కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇపుడు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ ఇప్పటికే 27 దేశాలకు వ్యాపించింది. ఈ దేశాల్లో ఇప్పటివరకు 780 మంకీపాక్స్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 
 
మే 13వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 కేసులు బయటపడగా ఈ నెల 2వ తేదీ వరకు 780 కేసులు నిర్ధారణ అయ్యాయని చెప్పింది. మంకీపాక్స్ వల్ల ఈ యేడాదిలో 7 దేశాల్లో 66 మంది మృతి చెందారని తెలిపింది.
 
మరోవైపు, మన దేశంలో కూడా మంకీపాక్స్ భయాందోళనలకు రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. బాలిక శరీరంపై దుద్దర్లు, దురద ఉన్నట్టు గుర్తించిన వైద్యుల ఆమె శాంపిల్స్‌ను పూణెలోని పరిశోధనా ల్యాబ్‌కు పంపించారు.