శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (11:11 IST)

దేశంలో కొత్తగా మర 2,338 కోవిడ్ పాజిటివ్ కేసులు

covid19
దేశంలో కొత్తగా మరో 2,338 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా బాధితుల్లో 19 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకుంటే 17,883 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,58,087 మందికి ఈ వైరస్ సోకింది. 
 
మరోవైపు, 4,26,15,574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,24,630 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 1,93,45,19,805 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు.