1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (09:33 IST)

భయపెడుతున్న మంకీపాక్స్ - పెరుగుతున్న కేసులు

monkeypox
కరోనా వైరస్ భయం క్రమంగా తగ్గిపోతున్న సమయంలో ఇపుడు మంకీపాక్స్ వైరస్ భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా మంకిపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మొదలైన కేసుల ప్రవాహం నెమ్మెదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ వైరస్ ఆదివారం నాటికి 12 దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 180 కేసులు నమోదయ్యాయి. 
 
యూరప్‌లోని 9 దేశాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. మరోవైపు అమెరికా, కెనడా, ఆస్ట్రలియా దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూసినట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 
 
ప్రపంచంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మశూచికి కారణమయ్యే వారియెలా వైరస్ కుటుంబానికి చెందిన ఈ మంకీపాక్స్ సోకితే శరీరంపై పొక్కులు, చలి, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ గ్రంథుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.