గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (10:05 IST)

అండమాన్ సముద్ర జలాలపై మృతదేహాలు... విమానశకలాలు

మయన్మార్ సైనిక విమానం కూలి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ మృతదేహాలు, సముద్ర శకలాలు సముద్ర జలాలపై తేలాడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి, మహిళ, చిన్

మయన్మార్ సైనిక విమానం కూలి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ మృతదేహాలు, సముద్ర శకలాలు సముద్ర జలాలపై తేలాడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి, మహిళ, చిన్నారి మృతదేహంతో పాటు లగేజీ బ్యాగ్‌లు, సేఫ్టీ జాకెట్లు, విమానం టైరు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. ఈ ఉదయం 8:25 గంటల ప్రాంతంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్టు మయన్మార్ సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 
 
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 100 మందికిపైగా సైనికులు, కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం అండమాన్‌ సముద్రంలో కుప్పకూలిపోయింది. విమానంలో సిబ్బంది సహా 106 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 12 మందికి పైగా పిల్లలు ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ విమానం లుంగ్లాన్ తీరానికి సమీపంలోనే కూలింది. ఈ విమాన శకలాల కోసం 9 నేవీ షిప్‌లు, మూడు విమానాలు ఈ విమానం కోసం గాలిస్తున్నాయి. కాగా, మయన్మార్‌ సైనిక విమానాల్లో చాలావరకు పాతబడిపోయాయని, దీనికి నిర్లక్ష్యం తోడవడంతో కాలం చెల్లాయని తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో రాజధాని నెపిడాలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో మంటలు చెలరేగి అయిదుగురు సిబ్బంది సజీవ దహనమైన విషయం తెల్సిందే.