ఫన్నీ వీడియో.. బ్యాగ్ ఎత్తుకుపోయిన పంది.. నగ్నంగా పరుగులు తీసిన పెద్దాయన
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలు భలే ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని సమయాల్లో అనుకోని విధంగా జరిగే కొన్ని సంఘటనలు సీరియస్‌గా కనిపించినా నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి ఘటనే జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని రాజధానికి అనుకోని ఉన్న గ్రన్ వెల్ అడవిలో ట్యూఫెల్సి సరస్సు ఉన్నది. ఆ సరస్సులో ఓ పెద్దాయన నగ్నంగా స్నానం చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి రెండు పందులు వచ్చాయి.
అక్కడ ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకుపోయాయి. ఆ బ్యాగ్ స్నానం చేస్తున్న పెద్దాయనది. ఆ బ్యాగ్‌లో ల్యాప్ టాప్, బట్టలు ఉన్నాయి. అక్కడికి వచ్చిన పంది అందులో ఆహరం ఉందేమో అనుకోని బ్యాగ్‌ను నోటకరుచుకొని పరుగు తీశాయి. అంతే, ఒంటిమీద బట్టలు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా బ్యాగ్ కోసం పరుగులు తీశాడు. ఆ సరస్సు ప్రాంతంలో అనేక మంది టూరిస్టులు ఉన్నారు.
ఈ తతంగాన్ని ఓ మహిళ వీడియోగా తీసి, ఆయనకే చూపించింది. ఆ వీడియో చూసి అయన మనసారా నవ్వుకున్నాడట. దీంతో ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చకచకా వైరల్ అయ్యాయి.