శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:33 IST)

కామారెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య అనుమానాస్పద మృతి, కానీ ప్రేమ పెళ్లి

కామారెడ్డికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పద మృతి చెందింది. దీంతో శరణ్య తల్లిదండ్రులు కామారెడ్డి నుంచి హుటాహుటిన బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. భర్త రోహిత్ హత్య చేసి ఉంటాడని లేదా వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
 
ఏడాది కిందటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు శరణ్య- రోహిత్‌లు. ఇద్దరిదీ కామారెడ్డి, పైగా క్లాస్‌మేట్స్. ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్నాళ్ల నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ కొట్టడం వేధించడం చేశాడని శరణ్య పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు.
 
భర్త వేధింపులు భరించలేక కామారెడ్డిలోని తల్లిగారింటికి శరణ్య వచ్చేయడంతో బాగా చూసుకుంటానని వేధించననీ పెద్దలు కోర్టు సమక్షంలో ఒప్పుకొని మూడు నెలల కిందటే మా కూతురుని తీసుకెళ్లాడు అని శరణ్య పేరెంట్స్ వాపోతున్నారు. అల్లుడు రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని శరణ్య తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.