గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (09:51 IST)

డ్రాగన్ కంట్రీ అండతో రొమ్ము విరుస్తున్న నేపాల్.. భారత్‌ టీవీ ఛానెల్స్‌పై నిషేధం

డ్రాగన్ కంట్రీ సహకారంతో మిత్రదేశంగా ఉన్న నేపాల్ ఇపుడు భారత్‌పై కాలు దువ్వుతోంది. ఇప్పటికే భారత భూభాగాలను తమ మ్యాప్‌లో చూపించుకుంది. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. 
 
తాజాగా మన దేశ టీవీ చానళ్లను ఆపేస్తున్నట్టు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. కేవలం దూరదర్శన్‌ను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. తమ నిర్ణయం వెనుక నేపాల్ ప్రభుత్వం లేదని... తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీనిపై నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ... జరుగుతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 
 
భారత టీవీ చానెళ్లలో నేపాల్‌కు, ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయం ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.