మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:54 IST)

బ్రెజిల్‌ లేక్ నుంచి యారా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

కరోనా వైరస్ అంటేనే ప్రపంచ జనాలు జడుసుకుంటున్నారు. కరోనా వైరస్ దెబ్బకు దాదాపు ఇప్పటికే 1200 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇలాంటి సమయంలో మరో వైరస్ వ్యాప్తి చెందేందుకు సిద్ధంగా వుంది. 
 
ఇప్పటికీ అది ప్రమాదకరం గాకపోయినా మున్ముందు దీని తీవ్రత ఎలా ఉండబోతుందనేది మాత్రం అంచనా వేయటం కష్టమనేది వైద్యనిపుణుల ఆందోళన. అదే యారా వైరస్. బ్రెజిల్‌లోని బెలో హోరిజోంటే అనే ఆర్టిఫిషియల్ లేక్‌లో బయటపడింది. దీని ప్రభావం మాత్రం కరోనాను మంచి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఈ యారా వైరస్ గాలి, నీరు ద్వారా  వ్యాపిస్తుందని తెలుస్తోంది.