1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (10:03 IST)

రియోలో పతకాలు తేలేని అథ్లెట్లు బొగ్గు గనుల్లో పనిచేయాల్సిందే: కిమ్ ఆదేశాలు

రియో ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించని అథ్లెట్లపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన బాధితుల జాబితాలో ఆ దేశ అథ్లెట్లు చేరారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఐదు స్వర్ణాలతో

రియో ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించని అథ్లెట్లపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన బాధితుల జాబితాలో ఆ దేశ అథ్లెట్లు చేరారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఐదు స్వర్ణాలతో సహా 17 పతకాలు తేవాలని అథ్లెట్లను జాంగ్ ఆదేశించారు. 
 
కానీ ఆ దేశ అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు మాత్రమే తెచ్చారు. అంతేకాదు దాయాది దేశం దక్షిణ కొరియా చేతిలో కొన్ని ఈవెంట్లలో ఓడిపోయారు. దీంతో కిమ్‌కు చిర్రెత్తుకొచ్చింది. పతకాలు తేలేని అథ్లెట్లు బొగ్గు గనుల్లో పనిచేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారు.