శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (11:43 IST)

శ్రీలంక రచయితకు బుకర్ ప్రైజ్ - పాత్రలతో చెప్పించిన యుద్ధ నేరాలు

Karunatilaka wins Booker Prize:
శ్రీలంక రచయిత షెహన్‌ కరుణతిలక 2022 సంవత్సరానికి బూకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. "ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలీ అల్మేదా" అనే నవలకుగాను ఆయనకు ఈ అవార్డు వరించింది. ఇందులో మానవత్వ లోతుల గురించి విపులంగా రాశారు. 
 
47 ఏళ్ళ కరుణతిలక బూకర్‌ ప్రైజ్‌ గెలచిన రెండవ శ్రీలంక రచయిత కావడం గమనార్హం. 1992లో ఇంగ్లీస్‌ పేషెంట్‌ నవల రాసిన లంక రచయిత మైఖేల్‌ ఒండాజే ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. ఓ ఫోటోగ్రాఫర్‌ కథే ద సెవన్‌ మూన్స్‌ ఆఫ్‌ మాలీ అల్మేదా. 1990 దశకంలో శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి ఈ నవలలోని పాత్రలతో చెప్పించారు. 
 
ముఖ్యంగా, జీవితం, మరణానికి సంబంధించిన సత్యాలను చాలా సాహసోపేతంగా రచయిత తన నవలలో రాసినట్లు జడ్జిలు తెలిపారు. యుద్ధ నేరాలకు చెందిన ఫోటోలతో ఆ దేశాన్ని మెల్కోల్పిన తీరు ఆ కథలో ఉన్నట్లు బూకర్‌ కమిటీ అభిప్రాయపడింది. శ్రీలంకలో సాగిన అకృత్యాలను సెటైర్‌ రూపంలోనూ ఆ నవలలో చిత్రీకరించారు.