శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌కు భంగపాటు.. విజేతగా శ్రీలంక

pak vs sl
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బోల్తాపడింది. దీంతో ఆసియా కప్ విజేతగా శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో ఆరోసారి లంకేయులు ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన పాక్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ హసరంగ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు నేలకూల్చి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా లంకేయులు ఆరోసారి ఆసియా విజేతలుగా నిలిచారు. 
 
శ్రీలంక జట్టు గతంలో 1986, 1997, 2004, 2008, 2014లలో విజేతగా నిలిచింది. ఇపుడు మరోమారు గెలుపొందింది. అయితే, అత్యధిక ఆసియా కప్ టైటిల్స్ సాధించిన జట్టుకా భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా మొత్తం ఏడుసార్లు విజేతగా నిలిచింది.