బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:18 IST)

ఆసియా కప్ : ఆఫ్ఘన్ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే భారత్ ఇంటికే...

team india
దుబాయ్ వేదికగా ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఇందులో ఆసియా ఖండానికి చెందిన దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. ఈ టోర్నీలో ఆడే మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మాత్రమే విశేష ఆదరణ లభిస్తుంది. అయితే, అలాంటి జట్లలో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. బుధవారం పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగే సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు గెలిస్తే మాత్రం భారత్ ముల్లెమూట సర్దుకుని ఇంటికి రావాల్సివుంటుంది. 
 
కాగా, మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చేతిలో భారత్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 173 పరుగులు చేయగా, ఆ తర్వాత శ్రీలంక జట్టూ అడుతూపాడుతూ మరో బంతి మిగిలివుండగానే 174 పరుగులు చేసి విజయభేరీ మోగించింది. సూపర్-4లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడటంతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. 
 
ఇదిలావుంటే, ఆసియా కప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు (1016) సాధించిన బ్యాటర్లుగా రోహిత్ శర్మ మాస్టర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (971)ను అధికమించాడు. 
 
ఆసియా కప్‌లో శ్రీలంక అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోంది. ఈ జట్టు వరుసగా 184, 176, 174.. లంకేయులు తమ చివరి మూడు మ్యాచ్‌లలో ఛేదించిన స్కోర్లు. ఆ జట్టు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇస్తుండగా, మ్యాచ్ ఆఖరులో తీవ్రమైన ఒత్తిడిని అధికమిస్తూ రాజపక్స, షనక‌లు ఫినిషింగ్ టచ్‌లు ఇస్తున్నారు. ఫలితంగా ఎంతటి భారీ లక్ష్యమైన సునాయాసంగా ఛేదిస్తుంది.