కొత్త సంవత్సరం రోజునే పాకిస్తాన్ వక్రబుద్ధి- కాల్పులు
కొత్త సంవత్సరం రోజునే పాకిస్తాన్.. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ-కాశ్మీర్‌లోని దేశ నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు కొత్త సంవత్సరాది రోజునే వక్రబుద్ధిని బయటపెట్టారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘటి సెక్టార్‌లో బుధవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడిచారు.
రాత్రి 9 గంటల సమయంలో భారత భూభాగంవైపు ఏకపక్ష కాల్పులు జరుపుతూ భారత సేనలను పాక్ రేంజర్లు రెచ్చగొట్టారు. దీంతో భారత సేనలు కూడా ధీటుగా స్పందించాయి. దీంతో పాక్ సేనలు తోకముడిచారు.
ఇరు పక్షాల మధ్య రాత్రి 11 గంటల వరకు ఎదురు కాల్పులు కొనసాగినట్లు భారత సైనిక అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు పాక్ కాల్పుల్లో భారత సేనలు ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.