శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (17:09 IST)

పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు: 99 చోట్ల గెలిచిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ

pakistan flag
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి అనుబంధంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు చాలా జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. 
 
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కూడా మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటివరకు విడుదలైన ఫలితాలలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 99 చోట్ల గెలుపొందారు.
 
పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయడానికి మొగ్గుచూపింది. ఇప్పటివరకు 69 సీట్లతో రెండవ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 51 స్థానాలతో మూడవ స్థానంలో ఉంది.
 
మిగిలిన 22 సీట్లు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్‌ఎన్‌కి లేదా పీపీపీకి ఆధిక్యం ఇవ్వడానికి సరిపోవు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 133 సీట్లు కాగా.. ఈ సంఖ్యకు దగ్గరలో ఏ పార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది.