శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (13:13 IST)

అభినందన్ విడుదల కాదు.. ఆ పని చేస్తేనే శాంతి నెలకొంటుంది... : ఇమ్రాన్ ఖాన్

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేసినందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాక్ జాతీయ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ స్పందించారు. 
 
తాను నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు ఏ విధంగానూ అర్హుడిని కాదని స్పష్టంచేశారు. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం వివాదాన్ని పరిష్కరించి ఉపఖండంలో శాంతి నెలకొల్పినపుడే మానవాభివృద్ధికి దారితీస్తుందని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసిన అనంతరం పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ దేశ చట్టసభ పాకిస్థాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెల్సిందే.
 
ఇదే అంశంపై ఆ దేశ సమాచారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి పార్లమెంటులో మాట్లాడుతూ, ఇస్లామాబాద్, న్యూఢిల్లీల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సున్నితమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. కానీ, జెనీవా ఒప్పందం మేరకు భారత వింగ్ కమాండర్‌ను విడుదల చేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెల్సిందే.