సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (11:39 IST)

పాప్ సింగర్ పశ్చాత్తాపం... పాపాలను అల్లా క్షమిస్తారంటూ...

పాకిస్థాన్ పాప్ సింగర్ పశ్చాత్తాపం చెందారు. తన పాపాలను అల్లా క్షమించేస్తారంటూ వ్యాఖ్యానించింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో కదు రబీ ఫిర్జాదా. గత కొన్ని రోజులుగా మీడియాలో నలుగుతున్న పేరు. 
 
ముఖ్యంగా, కాశ్మీరు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఇటీవల ఆమె కొండచిలువలు, మొసళ్లతో వీడియో, నడుం చుట్టూ బాంబులు కట్టుకుని ఫొటోలు విడుదల చేశారు. ఆ కొండచిలువలు, మొసళ్లు మోడీని నంజుకుతింటాయని, ఆత్మాహుతి దాడి చేస్తానని ఇష్టమొచ్చినట్టు రాతలు రాశారు.
 
అలా మీడియా దృష్టిని ఆకర్షించిన రబీ ఫిర్జాదాకు చెందిన నగ్న వీడియోలు ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. దీనిపై ఆమె స్పందించారు. ఆటపాటలకు ముగింపు పలుకుతున్నానని ప్రకటించారు. నగ్నచిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 'నా పాపాలను అల్లా క్షమించాలి. నా విషయంలో ప్రజలను మెత్తబడేట్లు చేయాలి' అని ట్విటర్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.