వర్షాకాలంలో దోమలను తరిమికొట్టే... లావెండర్ ... (video)

mosquito
Last Updated: శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:00 IST)
దోమలను జ్వరానికి కారణమవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించేలా చేస్తున్నాయి. అలాంటి దోమలను తరిమికొట్టాలంటే.. ఈ
చిట్కాలు పాటించాలి. బంతిపూల మొక్కలను ఇంటి పెరట్లో లేదా కుండీల్లో పెంచుకోవడం ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు.

బంతిపూల మొక్కల నుంచి వచ్చే వాసనకు దోమలను పారదోలే గుణం వుంటుంది. అలాగే గదిలోని కిటీకీలను, తలుపులు మూసివేసి.. కర్పూరాన్ని వెలిగించి పది నిమిషాల పాటు వుంచితే మస్కిటోస్ ఫ్రీ జోన్‌గా మారిపోతుంది. అలాగే వేప నూనె, కొబ్బరినూనెను మిక్స్ చేసి చర్మానికి రాసుకోవడం ద్వారా బారి నుంచి తప్పించుకోవచ్చు.

అలాగే ఆరుపాళ్లు వెల్లుల్లి రసానికి, ఐదుపాళ్లు నీరు కలిపిన ద్రావకాన్ని ఒంటికి రాసుకోవాలి. దీనివల్ల దోమలు కుట్టవు. తులసి మొక్కలను కిటికీల వద్ద వుంచడం ద్వారా ఇంట్లోకి దోమలు ప్రవేశించవు. ఇక లావెండర్ నూనెలతో వెలిగించిన దీపాలను మీ గదుల్లో వుంచడం ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు. లావెండర్ రూమ్ ఫ్రెష్‌నర్ల ద్వారా దోమలను దూరం చేయవచ్చు.

వేపనూనె, నిమ్మగడ్డి కాండం నుంచి తీసిన రసంతో దీపాలు వెలిగించినా దోమలు పారిపోతాయి. ఇక నీరు నిల్వ వుండే మురికి గుంటల్లో దోమలు గుడ్లు పెడతాయి. దీన్ని నివారించేందుకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :