శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: గురువారం, 12 సెప్టెంబరు 2019 (12:17 IST)

వర్షాకాలంలో మీ జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా ఉండాలంటే?

వర్షాకాలంలో మీ జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా ఉండాలంటే? పెరుగు-గుడ్డుతో కండిషనర్‌గా అప్లై చేయాలని బ్యూటీషన్లు చెబుతున్నారు. వర్షాకాలంలో జుట్టు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంకా కఠినమైన కెమికల్స్, హెయిర్ స్ప్రేలు, జెల్లస్‌ను వర్షాకాలంలో చాలామటుకు తగ్గించాలి. 
 
ఇంకా సహజ సిద్ధమైన ఇంట్లో లభించే వాటితో జుట్టును సంరక్షించుకోవాలి. ఈ క్రమంలో పెరుగు-గుడ్డు జుట్టును మృదువుగా చేయడంలో బాగా పనిచేస్తాయి.
 
రెండు చెంచాల పెరుగులో ఒక గుడ్డును వేసి బాగా మిక్స్ చేసి, తలస్నానం చేసిన తర్వాత కండీషనర్‌గా అప్లై చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేస్తే జుట్టు మంచి షైనింగ్‌తో ఒత్తుగా సాఫ్ట్‌గా ఉంటాయి.