శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (11:15 IST)

పైలట్ గర్ల్ ఫ్రెండ్‌కి ఎలా ప్రపోజ్ చేశాడో చూడండి

సోషల్ మీడియా ప్రభావంతో ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రేమికులు కొత్త కొత్తదారులను వెతుకుతూ వున్నారు. ఇప్పటికే విమానంలో ఎగురుతూ లవ్ ప్రపోజ్ చేయడం, ప్రియురాలికి నచ్చిన వస్తువులు కొనిపెట్టి

సోషల్ మీడియా ప్రభావంతో ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రేమికులు కొత్త కొత్తదారులను వెతుకుతూ వున్నారు. ఇప్పటికే విమానంలో ఎగురుతూ లవ్ ప్రపోజ్ చేయడం, ప్రియురాలికి నచ్చిన వస్తువులు కొనిపెట్టి తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ పైల‌ట్ త‌న ప్రియురాలికి ప్ర‌పోజ్ చేసిన విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.  
 
డిసెంబర్ 23న పైల‌ట్ జాన్ ఎమ‌ర్స‌న్‌, ఫ్లైట్ అటెండెంట్ లారెన్ గిబ్స్‌లు డెట్రాయిట్ నుంచి ఒక్లాహామా సిటీకి వెళ్తున్న విమానంలో త‌మ త‌మ విధుల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు. విమాన ప్ర‌యాణం గురించి మైకులో ఎమ‌ర్స‌న్ ప్ర‌యాణికులకు సూచ‌న‌లు చేస్తున్నాడు. ఆ సూచ‌న‌ల్లో భాగంగా లారెన్ గురించి ప్ర‌స్తావించాడు. అలాగే లారెన్‌కి ప్రపోజ్ కూడా చేశాడు. 
 
ఇది విని... డైమండ్ రింగుతో ప్రపోజ్ చేయడంతో లారెన్ పొంగిపోయింది. ఇంకా ఎమర్సన్ ప్రపోజల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్యాయంగా ప్రేమికుడికి ముద్దెట్టి.. కౌగిలించుకుంది. లారెన్ ఎమర్సెన్ ప్రేమకు పచ్చాజెండా ఊపటంతో ప్ర‌యాణికులంతా లేచి చ‌ప్ప‌ట్లు కొడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.