శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (16:33 IST)

మనిషి కండరాలు భక్షించే బ్యాక్టీరియా.. ఎక్కడ?

flesh-eating-bacteria
ప్రస్తుతం కొత్త కొత్త వ్యాధులు, వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి చొరబడితే మాంసాన్ని ఆరగిస్తుందట. ఈ బ్యాక్టీరియా బారినపడిన అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇటువంటి కేసులు అమెరికాలో వేగంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా గురించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరికలు చేసింది. 
 
విబ్రియో వల్నిఫికస్ అనే బ్యాక్టీరియా గాయాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి, క్రమంగా చర్మాన్ని, కండరాలు, రక్తనాళాలను కూడా భక్షిస్తుందట. ఈ బ్యాక్టీరియా బారినపడి ఇప్పటికే దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బ్యాక్టీరియా సోకితో పొత్తు కడుపు అంతా తిమ్మిరిగా ఉంటుందని, వికారంతో వాంతులు అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. చలి జ్వరం కూడా వస్తుందని ఇంటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.