బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2016 (13:10 IST)

రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో అంతరించిపోతున్న పక్షుల ఉనికి.. 108 పక్షుల రకాలు..?

సెల్‌ఫోన్ల పుణ్యంతో పక్షులు అంతరించిపోతున్నాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి, వాటి నివాస స్థావరాలపై డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో సుమారు 210 పక్షి

సెల్‌ఫోన్ల పుణ్యంతో పక్షులు అంతరించిపోతున్నాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి, వాటి నివాస స్థావరాలపై డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో సుమారు 210 పక్షి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పక్షి జాతులు ఉండగా.. అందులో 108 పక్షుల రకాలు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు డ్యూక్ వర్శిటీ వెల్లడించింది.
 
ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) గుర్తించలేదని తెలిపింది. కానీ ప్రస్తుత పరిశోధనల ప్రకారం 210 రకాల జాతుల ఉనికి ప్రమాదంలో ఉన్నట్లు కనుగొన్నారు. డిజిటల్ మ్యాప్స్, రెగ్యులర్ గ్లోబల్ అసెస్‌మెంట్స్, శాటిలైట్ ఇమేజెస్‌కు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని  ఉపయోగించడం ద్వారా పక్షుల జాతి అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.