గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (13:32 IST)

"అరికొంబన్‌''ను పట్టుకున్నారు.. పాపనాశం అడవుల్లో వదిలేస్తారట!

Arikomban
తమిళనాడు తేనిలో ప్రజలు నివాసంలోకి వచ్చిన అరికొంబన్ ప్రజలను నానా తిప్పలు పెట్టింది. ఈ ఏనుగు దాడిలో ఓ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఈ సైకో ఏనుగును అటవీ శాఖా అధికారులు పట్టుకున్నారు. 
 
గతంలో ఏప్రిల్ 29న ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ నుంచి కేరళ అటవీ శాఖ ఏనుగును పట్టుకుని పెరియార్ టైగర్ రిజర్వ్  (పీటీఆర్)కు తరలించింది. వారం క్రితం, ఏనుగు కుంబమ్ పట్టణంలోకి ప్రవేశించింది. 
 
దీని ఫలితంగా ఒక భద్రతా అధికారి తన స్కూటర్‌పై వెళుతుండగా ఏనుగును ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఉసిలంపట్టి సమీపంలోని అరటి పొలానికి చేరుకోగానే 'అరికొంబన్' పట్టుకుంది.
 
ఏనుగులను ట్రాక్ చేయడంలో నైపుణ్యం కలిగిన ఐదుగురు సభ్యుల బృందాన్ని గత వారం రోజులుగా అటవీ శాఖ మోహరించింది. ఈ బృందం చేతిలో చిక్కిన ఏనుగును ప్రస్తుతం తమిళనాడులోని పాపనాశంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నారు.