శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (21:06 IST)

కేరళలో వందే భారత్ రైలు ఢీకొని కార్మికుడి మృతి

Bharat Express
వందే భారత్ రైలు తిరువనంతపురం నుండి కేరళలోని కాసరగోడ్ వరకు నడుస్తుంది. ఏప్రిల్ 25న ప్రధాని మోదీ ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. 
 
ఆ తర్వాత ఈ రైలు పరుగు ప్రారంభించగానే కొందరు ఈ రైలుపై రెండుసార్లు రాళ్లు రువ్వారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కోజికోడ్ సమీపంలో వందేభారత్ రైలు వెళుతుండగా, ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తున్న కార్మికుడిని రైలు ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.