శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (10:32 IST)

సిడ్నీ నగరంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) ఎంఎస్‌ చదివేందుకు ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నది.
 
గురువారం బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 
 
రక్షిత మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షిత తండ్రి వెంకట్‌ రెడ్డి ఆర్మీలో పనిచేసి స్వచ్ఛందంగా రిటైరై ప్రస్తుతం డీఆర్‌డీఏలో ఉద్యోగం చేస్తున్నారు.