శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తీరని ధన దాహం... కట్నం ఇవ్వలేదనీ కాల్‌గర్ల్‌గా మార్చేశాడు..

ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భర్త అనే పదానికి కళంకం తెచ్చాడు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదన్న అక్కసుతో కట్టుకున్న భార్యను కాల్‌గర్ల్‌గా మార్చేశాడు. డబ్బు సంపాదన కోసం భార్య అందాలే పెట్టుబడిగా పెట్టాడు. భర్త అరాచకాన్ని భరించలేక భార్య చివరికి పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ ఆ బాధితురాలికి న్యాయం జరగలేదు. దీంతో మీడియా సహకారంతో పోలీస్ పై అధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా తిమ్మనాయుడిపాళెంకు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కూడా నాలుగు నెలల క్రితం జరిగింది. వివాహ సమయంలో 10 లక్షల బంగారం, 10 లక్షల కట్నం ఇచ్చారు. 
 
పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా గడవక ముందే ఏం బుద్ధి పుట్టిందో.. భార్య ఫొటోలను కాలేజీ గ్రూప్‌లో భర్త పోస్ట్‌, కాల్‌గర్ల్‌గా మార్చేశాడు. ఇదేమిటి అని ప్రశ్నించిన భార్యను రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ దారుణం బయటకు రావడంతో భర్త‌ ఇంటిపై భార్య తరపు బంధువుల దాడి చేశారు. 
 
భర్తపై దిశ పీఎస్‌లో భార్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ బాధితురాలి గోడును పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును స్థానికులు తప్పుబడుతున్నారు. భర్త ఎస్‌జీఎస్‌ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటం గమనార్హం.