శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (14:46 IST)

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి

plane crash
రష్యాలో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మెన్సెలిన్స్క్‌ పట్టణ సమీపంలోని తతర్‌స్థాన్ ప్రాంతంలో లైట్ వెయిట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.
 
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 22 ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే 19 మంది మరణించగా.. గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం... 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, మరో ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. ఐతే గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం పడలేదు. చివరకు వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. 
 
ఈ ఘటనపై రష్యా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే ప్రమాదం గురించి తెలిసింది. ఐతే విమానం కూలిపోవడానికి కాణమేంటన్నది తెలియాల్సి ఉంది.