గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:16 IST)

రష్యాలో దారుణం : చెల్లిని 140 సార్లు కత్తితో పొడిచి.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కోసి....

రష్యాలో దారుణం జరిగింది. తన చెల్లి ఓ మోడల్‌గా మంచి పేరు గడించడాన్ని జీర్ణించుకోలేని ఓ అక్క అత్యంత క్రూరంగా హత్య చేసింది. చెల్లిని ఏకంగా 140 సార్లు కత్తితో పొడిచి.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కత్తిరించి

రష్యాలో దారుణం జరిగింది. తన చెల్లి ఓ మోడల్‌గా మంచి పేరు గడించడాన్ని జీర్ణించుకోలేని ఓ అక్క అత్యంత క్రూరంగా హత్య చేసింది. చెల్లిని ఏకంగా 140 సార్లు కత్తితో పొడిచి.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కత్తిరించి మరీ చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతంలో నివాసముండే స్టెఫానియా డుబ్రోవినా ఆ దేశంలో ఉన్న టీనేజ్ మోడళ్ళలో ఒకరు. మంచి పేరు కూడా ఉంది. ఈమె అక్క ఎలిజవెటా, మరో వ్యక్తితో కలిసి ఇంట్లోనే డ్రగ్స్ సేవించారు. మందు నిండుకోవడంతో  కొనుక్కుని రావడానికి ఆ వ్యక్తి బయటకెళ్లాడు. అతను బయటకు వెళ్లగానే ఎలిజవెటా తలుపులన్నీ మూసేసి, చెల్లెలిని దారుణాతి దారుణంగా పొడిచి చంపింది. 
 
ఏకంగా 140 సార్లు కత్తితో పొడిచి, కనుగుడ్లు బయటకు లాగేసి, చెవులు కోసేసి మరీ చంపింది. అంతటితో ఆమె కసి చల్లారలేదు. చెవులు కోసేసి, నానా బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత మృతదేహానికి బాగా జుట్టు దువ్వి, మేకప్ చేసింది కూడా. చెల్లెలికి మోడల్‌గా బాగా పేరు రావడంతో ఈర్ష్య తట్టుకోలేకనే ఆమె ఇలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.