బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:36 IST)

మూడో రోజు కొనసాగుతున్న బాంబుల వర్షం

ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం శనివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ దేశం మొత్తాన్ని రష్యా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అలాగే, ఉక్రెయిన్‌లో నెలకొన్న హృదయ విదాకర దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయకుండా ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది. 
 
మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌ వద్ద బాంబు దాడి జరగడం కలకలం రేపింది. అదేసమయంపై రష్యాపై అమెరికాతో పాటు అనేక దేశాలన్నీ కలిసి అనేక కఠినతరమైన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగే, రష్యా సైనిక బలగాలు తక్షణం ఉక్రెయిన్‌ను వీడిపోవాలని ఐక్యరాజ్య సమితి పాటు అనేక దేశాలు చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.