శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (09:15 IST)

సౌదీ యువరాజు ఉరితీత.. వ్యక్తిని కాల్చి చంపిన కేసులో...

సౌదీ యువరాజును ఉరితీశారు. ఓ వ్యక్తిని కాల్చి చంపిన కేసులో ఈ శిక్షను అమలు చేశారు. సౌదీ యువరాజుగా టర్కిబిన్ సౌద్ అల్ కబీర్ కొనసాగుతున్నారు. ఈయన గత 2012లో మిత్రుడైన అదెల్‌ అనే వ్యక్తితో గొడవపడ్డాడు.

సౌదీ యువరాజును ఉరితీశారు. ఓ వ్యక్తిని కాల్చి చంపిన కేసులో ఈ శిక్షను అమలు చేశారు. సౌదీ యువరాజుగా టర్కిబిన్ సౌద్ అల్ కబీర్ కొనసాగుతున్నారు. ఈయన గత 2012లో మిత్రుడైన అదెల్‌ అనే వ్యక్తితో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువరాజు... అతడిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో ప్రభుత్వం యువరాజుకు మరణశిక్ష విధించింది. 
 
దీంతో సౌదీలో ఈ ఏడాది మరణశిక్ష అమలు చేసిన వారి సంఖ్య 134కి చేరింది. కాగా, రాజ కుటుంబ సభ్యుడిని ఉరి తీయడం సౌదీలో అరుదైన ఘటనగా నిల్చింది. అయితే, ఓ యువరాజును ఉరితీయడం ఇప్పుడు సౌదీలో సంచలనంగా మారింది.