శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (16:53 IST)

హలో... అంటే... ఎస్ నేనే చెప్పండి... అంటే మీ డబ్బు మటాష్...

మోసగాళ్లు ఎంతకైనా తెగిస్తారు. ఏదో అపరిచిత కాల్... ఫోన్ చేసి మీరు ఫలానా పని చేస్తుంటారు కదూ... అని అడగ్గానే, యస్, అవును చెప్పండి అంటే మీ డబ్బులు చేజేతులా వాడికి అప్పగించినట్లే. కొన్నిసార్లు అపరిచిత కాల

మోసగాళ్లు ఎంతకైనా తెగిస్తారు. ఏదో అపరిచిత కాల్... ఫోన్ చేసి మీరు ఫలానా పని చేస్తుంటారు కదూ... అని అడగ్గానే, యస్, అవును చెప్పండి అంటే మీ డబ్బులు చేజేతులా వాడికి అప్పగించినట్లే. కొన్నిసార్లు అపరిచిత కాల్ అని పట్టించుకోకపోయినా మళ్లీ వారే చేసి నేను మాట్లాడేది మీకు వినిపిస్తోందా? అని అంటారు. దానికి మనం యస్... వినిపిస్తోంది చెప్పండి అంటే, సరే ఓకే అని చెప్పేసి ఆ తర్వాత మన పని పడతారు కేటుగాళ్లు. 
 
మనం మాట్లాడేటపుడు ఆ మాటలను కావలసిన విధంగా రికార్డు చేసి, ఆ తర్వాత కోర్టులో కేసు వేసి డబ్బు లాగేస్తున్న సంఘటనలు వెలుగుచూడటం షాకింగ్‌గా మారాయి. ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో ఇది ఎక్కువగా జరుగుతోందట. కాబట్టి అపరిచిత కాల్స్ వస్తే తస్మాత్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ అనే మాట అవద్దు. ఆ మాటకొస్తే అసలు ఆ ఫోన్ అటెండ్ చేయవద్దు.