అమెరికాలో కాల్పుల కలకలం .. ఆరుగురి మృతి  
                                       
                  
                  				  ప్రపంచంలో తుపాకీ కల్చర్ అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి. కొందరు దుండగులు జరిపే కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఇండియానాలో ఈ కాల్పులు జరిగాయి. 
				  											
																													
									  
	 
	ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు పాల్పడడంతో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అడమ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్‌లో జరిగింది. ఈ ఘటనను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించారని వివరించారు. 
				  
	 
	ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో మైనర్‌కి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స అందుతోందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఆ మైనర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.