మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (01:33 IST)

ప్రాణభయంతో బైక్‌మీదికి ఎగిరి దూకిన పాము.. ఆన్‌లైన్‌లో 20 లక్షల హిట్లు

పాము పగబడుతుందనీ, వెంటాడి చంపుతుందని శతాబ్దాలుగా ప్రపంచమంతటా నమ్మకాలు కొనసాగుతున్నాయి. కానీ పగబట్టడం పాము లక్షణం కానే కాదని, తన దారికి అడ్డువచ్చిన జంతువును, మనిషిని బెదరగొట్టే పనిలో ఉండి కుదరకపోతో కాటేస్తుందని, మనిషిని చూస్తే పాముకే భయమని ఆధునిక శాస్

పాము పగబడుతుందనీ, వెంటాడి చంపుతుందని శతాబ్దాలుగా ప్రపంచమంతటా నమ్మకాలు కొనసాగుతున్నాయి. కానీ పగబట్టడం పాము లక్షణం కానే కాదని, తన దారికి అడ్డువచ్చిన జంతువును, మనిషిని బెదరగొట్టే పనిలో ఉండి కుదరకపోతో కాటేస్తుందని, మనిషిని చూస్తే పాముకే భయమని ఆధునిక శాస్త్రం చెబుతోంది. దీనికి ఉదాహరణగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక ఘటన లక్షలాది మంది నెటిజన్లను గగుర్పాటుకు గురి చేస్తోంది.
 
ఏప్రిల్ 16న థాయిలాండ్‌లోని లాంపాంగ్‌ రోడ్డులో పట్టపగలు ఓ వ్యక్తి బైక్‌ వేసుకొని వేగంగా వెళుతున్నాడు. అతడి వెనుకాలే ఓ కారులో కొంతమంది వస్తున్నారు.వారు సరదాగా రోడ్డు వెంట వీడియోలు తీస్తూ డ్రైవ్‌ చేస్తున్నారు. అంతలో తమ కారును దాటేసి ముందుకెళ్లిన బైక్‌పై వారి దృష్టిపడి ఆ బైకిస్టును వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈలోగా అక్కడ ఏదో అనూహ్య సంఘటన జరగబోతున్నట్లు వారికి అనిపించింది. 
 
ఎందుకంటే రోడ్డుపక్కనే ఉన్న చెట్లల్లో నుంచి ఓ పెద్ద పాము రోడ్డు దాటడం ప్రారంభించింది. సరిగ్గా అది వచ్చే సమయానికి బైకిస్టు కూడా వెళ్లాడు. దీంతో భయంతో ఆ పాము కాస్త ఎక్కడ బైక్‌ కింద పడతానో అని ఎగిరి దూకింది. ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే ‘నాకు నీ బైక్‌పై లిఫ్ట్‌ ఇవ్వు అని అడిగి అందుకున్నట్లుగా.. అదృష్టవశాత్తు అతడు బైక్‌ వేగం పెంచడంతో పాముకు అందకుండా పోయాడు. 
 
వాస్తవానికి అది భయంకరమైన విష సర్పం. అది భయంతో దూకినప్పటికీ అతడు దొరికినట్లయితే ఆ వేగంలోనే కాటు వేసేది. ఈ వీడియోను ఈ నెల (ఏప్రిల్‌) 17న యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయగా మూడురోజుల్లోనే దాదాపు 20లక్షలమంది చూశారు.