గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 7 మే 2016 (11:53 IST)

ఆ తల్లీ - బిడ్డలు 4వ అంతస్తు నుంచి దూకారు.. కానీ ప్రాణాలతో బయటపడ్డారు.. ఎలా?

కన్న తల్లే తన పిల్లల్ని నాలుగు అంతస్తులపై నుండి కిందకి పడేసి తాను దూకింది. ఇదేదో ఆత్మహత్య అనుకుంటే పొరపాటే. అందరూ కిందకి దూకినా బ్రతికున్నారు. ఎలా బతికుంటారు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. ఓ త‌ల్లి త‌న ముగ్గురు చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి ఓ భ‌వ‌నంలో నాలుగో అంత‌స్తులో ఉంటోంది. అనుకోని విధంగా ఇంట్లో మంట‌లు వ్యాపించాయి. ఆ సమయంలో ఎవరికి ఏమీ తోచదు. భయంతో కంగారు ప‌డిపోతుంటారు. 
 
కానీ ఆ మ‌హిళ ఆ సమయంలో చాలా తెలివిగా ప్రవర్తించింది. దక్షిణ కొరియాలో నాలుగు అంత‌స్తుల‌ బిల్డింగ్‌లో నివాస‌ం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఆమెతో పాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను కాపాడుకోవలనే దిశలో ఆ తల్లి 4 అంతస్థుల పైనుంచి ముగ్గురు పిల్లలను కిందకు పడేసింది. ఆ తర్వాత ఆమె కూడా కిందకు దూకేసింది. అదృష్టవశాత్తు ఆ బిల్డింగ్ కింద ప్రజలు ఉండటంతో ఆ పిల్లలను, తల్లిని సురక్షితంగా వారు కాపాడారు. అక్కడున్నవారు ఈ వీడియోని తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది.