సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:14 IST)

ఇరాన్ సైనికులపై ఆత్మాహుతి దాడి.. స్కెచ్ వేసింది.. పాకిస్థానీయుడే..

పుల్వామా దాడి విషయంలో తమకే పాపం తెలియదని ఇమ్రాన్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే జైషే మహ్మద్ రెండో వీడియోను విడుదల చేసింది. పుల్వామా దాడి తమ పనేనని మరోమారు స్పష్టం చేసింది.
 
పుల్వామా వంటి దాడులను తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలమని జైషే ఆ వీడియోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడితో 27 మంది ఇరాన్ సైనికులను కూడా పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది కూడా పాకిస్థాన్‌కు చెందిన వాడేనని ఇరాన్ ఆరోపించింది. 
 
ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దులో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా తరహాలోనే ఇరాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 27 మంది సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ సైనికులపై దాడికి పాల్పడింది పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ తేల్చేసింది. 
 
అంతేగాకుండా ఈ దాడికి స్కెచ్ వేసింది కూడా పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ గార్డ్స్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ పాక్‌పౌర్ తెలిపారు. తాజా ఉగ్రదాడి పాకిస్థానీయుల పనేనని తొలిసారి బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.