ఆదివారం, 16 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మార్చి 2025 (16:57 IST)

ఐఎస్ఎస్‌తో అనుసంధానమైన క్రూ-10 మిషన్ - వెల్కమ్ పలికిన సునీత - విల్మోర్ (Video)

Crew-10 ISS Space Docking
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో క్రూ-10 మిషన్ అనుసంధానమైంది. క్రూ-10 మిషన్‌లో నలుగురు వ్యోమగాములకు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు స్వాగతం పలికారు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఈ నెల 19వ తేదీన భూమికి తిరిగిరానున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమిమీదికి తీసుకొచ్చేందుకు నాసా - స్పేస్ ఎక్స్‌లు క్రూ-10 మిషన్ ప్రయోగాన్ని చేపట్టగా, ఇది ఐఎస్ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9.37 గంటలకు ఈ ప్రక్రియ పూర్తయినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. మరోవైపు దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా స్పేస్ ఎక్స్ విడుదల చేసింది. 
 
కాగా, ఐఎస్ఎస్‌కు వెళ్లిన వ్యోమగాములకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు స్వాగతం పలికారు. వీరిద్దరి స్థానంలో అమెరికాకు చెందిన ఆన్ మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్‌లు పని చేయనున్నారు. వీరందరూ ఆదివారం ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. వీరికి సునీత విలియమ్స్ స్వాగతం పలకడం గమనార్హం. 
 
మరోవైపు, క్రూ-10 ఈ నెల 19వ తేదీన భూమిమీదికి తిరిగిరానుంది. అందులో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు క్షేమంగా భూమిమీదికి చేరుకోనున్నారు. వీరిద్దరూ గత యేడాది జూన్ ఐదో తేదీ నుంచి ఐఎస్ఎస్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. వీరు ప్రయాణించి స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ అంతరిక్షంలోనే చిక్కుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.