శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2025 (14:01 IST)

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

Sunitha Williams
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకునివున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్ వాక్ కోసం బయటకు వచ్చారు. ఏడు నెలల తర్వాత ఆమె ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె... నాసాకు చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి ఐఎస్ఎస్‌కు సంబంధించి కొన్ని మరమ్మతు పనులు చేపట్టాల్సివుంది. 2012లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా, ఓవరాల్‌గా ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. 
 
సునీత, విల్మెర్లు 8 రోజుల మిషన్‌లో భాగంగా గత యేడాది జూన్ 6వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్‌సూల్లో ‘ఐఎస్ఎస్'కు వెళ్లారు. అదే నెల 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై.. వారు అక్కడే చిక్కుకుపోయారు. 
 
ఈ ఏడాది మార్చి ఆఖరులో లేదా ఏప్రిల్ నెలలో వారు భూమికి తిరుగుప్రయాణమయ్యే అవకాశం ఉందని సమాచారం. సునీతా విలియమ్స్ ప్రస్తుతం మూడో రోదసి యాత్రలో ఉన్నారు. గతంలో 2006, 2012లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్ వాక్‌లు నిర్వహించి.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉండి సరికొత్త రికార్డు నెలకొల్పారు.