సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (16:39 IST)

తైవాన్ భూకంపం.. అనేక వీడియోలు వైరల్.. స్విమ్మింగ్ పూల్..?

Taiwan
Taiwan
తైవాన్ భూకంపం ధాటికి ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. 736 మంది గాయపడ్డారు. 77 మంది టన్నెల్స్ లో చిక్కుకుపోయారు. వందల సంఖ్యలో ప్రజలు తమ వాహనాలు సహా హైవేలపై నిలిచిపోయారు. చాలాచోట్ల భవనాలు ఒరిగిపోయాయి. 
 
అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తైవాన్ భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి స్విమ్మింగ్  పూల్‌లో వుండగా నీళ్లు అటూ ఇటూ వూగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
ఓ ఫ్లైఓవర్ పై వాహనాలు వెళుతుండగా, ఒక్కసారిగా రోడ్డు ఊయలలా ఊగిపోవడం వీడియోలో రికార్డయింది. ఇలా పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.