మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (15:35 IST)

ఖురాన్‌ను అవమానించారని మోడల్‌ చేతికి బేడీలు

Taliban
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు అరాచకంగా పాలన సాగిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా అధికారాన్ని చెలాయిస్తున్నారు. తాజాగా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్, ఇస్లాంను అవమానించారంటూ ప్రముఖ మోడల్, అతని సహచరులను తాలిబన్ పాలకులు అరెస్టు చేయించారు. పైగా, ఆ మోడల్ చేతికి సంకెళ్ళు కూడా వేశారు. ఈ మోడల్ పేరు అజ్మల్ హకీకీ. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాలిబన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. 
 
ఈ వీడియోలో హకీకి సహోద్యోగి అయిన గులాం సఖీ తన ప్రసంగంలో ఖురాన్ సూక్తులను హాస్య స్వరంతో పఠిస్తుండగా, హకీకి నవ్వుతూ కనిపించాడు. దీంతో వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని జైలుకు తరిలించి లేత గోధుమ రంగు ధరించేలా చేశారు. ఈ దుస్తుల్లో తాలిన్ ప్రభుత్వానికి, మత పెద్దలకు క్షమాపణలు చెబుతున్న వీడియోను తాలిబన్లు విడుదల చేశారు. 
 
ఈ వీడియోలో తాలిబన్ తీవ్రవాదులు ఓ సందేశాన్ని కూడా వెల్లడించారు. మహ్మద్ ప్రవక్త ఖురాన్ సూక్తులను అవమానించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, హకీకి, అతడి అనుచరులను తక్షణం విడుదల చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది.