శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (13:03 IST)

జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు

arrest
హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో జరిగిన సామూహిక అత్యాచార కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఉమర్ ఖాన్‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తీసుకొచ్చినట్టు పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మైనర్ బాలుడుని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ఐదుగురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 
 
గత నెల 28వ తేదీన ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్ నంబరు 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. అక్కడ పార్టీ చేసుకున్న అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన నిందితులు కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.