గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (17:45 IST)

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా... ఫ్రీ ఫైర్ ఆడుతూ...

pubg game
ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా అయ్యింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్‌కు చెందిన ఓ బాలుడు (16) తన తాత మొబైల్‌ తీసుకొని అందులో ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత తాత ఫోన్‌లో ఉన్న తన తల్లి అకౌంట్‌ నుంచి మొదటగా రూ.1,500 పెట్టి ఆట ఆడటం మొదలుపెట్టాడు.
 
ఆ తర్వాత రూ .10 వేల చొప్పున డబ్బులు పెట్టాడు. అలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ.9 లక్షలపాటు గేమ్‌ను ఆడాడు. అంతటితో ఆగకుండా.. ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాలోంచి ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.1.60 లక్షలు, రూ.1.45 లక్షలు, ఇలా విడతల వారీగా రూ.27 లక్షలతో ఫ్రీ ఫైర్‌ గేమ్ ఆడాడు. అయితే.. బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్ ఖాళీ అంటూ అధికారులు చెప్పడంతో ఆమె షాకైంది.
 
వెంటనే లబోదిబోమంటూ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆయన మృతి అనంతరం వచ్చిన డబ్బు ఇదేనంటూ బాలుడి తల్లి పోలీసులతో చెప్పి వాపోయింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాంటూ పోలీసులను కోరింది.