శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (14:05 IST)

హైదరాబాద్ క్లబ్ మస్తీలో ఎస్.ఓ.టీ పోలీసుల సోదాలు

Club Masti Pub,
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరంలోని పలు క్లబ్బులపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ క్లబ్బుల్లో అశ్లీల నృత్యాలు, క్యాబరే డ్యాన్సులు చేస్తున్నట్టు వస్తున్న పక్కా సమాచారంతో ఈ ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. తాజాగా నగరంలోని క్లబ్ మస్తీ పబ్‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ మస్తీ పబ్‌లో కస్టమర్ల కోసం యువతులతో అర్థనగ్న నృత్యాలు ఏర్పాటు చేయించినట్టు గుర్తించారు. 
 
ముఖ్యంగా, క్లబ్‌లో పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల సమయంలో 9 మంది యవతులు, పబ్ మేనేరు ప్రదీప్, డీజే ఆపరేటర్ ధనరాజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. ఈ క్లబ్‌లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్న వారిని ఎస్.ఓ.టి పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.