శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (11:45 IST)

టైట్ ఫిట్టింగ్ డ్రెస్ వేసుకున్న యువతి.. కాల్చి చంపిన తాలిబన్లు

అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు ఆప్ఘనిస్థాన్ నుంచి వైదొలగిన తర్వాత తాలిబన్ తీవ్రవాదులు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే రెండు కీలకమైన నగరాలను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులు.. మరిన్ని నగరాలపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
 
అదేసమయంలో తాలిబన్ తీవ్రవాదుల అకృత్యాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి టైట్ ఫిట్టింగ్ దుస్తులు వేసినందుకు కాల్చి చంపేశారు. మృతురాలి పేరు న‌జానిన్ (21). 
 
ఆమె టైట్ ఫిట్టింగ్ దుస్తులు వేసి బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా తాలిబ‌న్లు చంపేశార‌ని పోలీసులు గుర్తించారు. మ‌హిళ‌లు ఎవ‌రూ జాబ్ చేయ‌కూడ‌ద‌ని, ప‌ని కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ క్ర‌మంలోనే బ‌య‌ట క‌న‌ప‌డుతోన్న మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. అయితే, న‌జావిన్‌ను తాము చంప‌లేద‌ని,  పోలీసులు త‌మ‌పై కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తాలిబ‌న్లు చెప్పుకొచ్చారు.