సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (09:22 IST)

విమానంలో ప్రయాణికుడి వెకిలి చేష్టలు : సీటుకు కట్టేసిన సిబ్బంది

అమెరికాకు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. అతడి వెకిలి చేష్టలను భరించలేని సిబ్బంది.. ఆ ప్రయాణికుడుని సీటుకు కట్టేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానంలో అమెరికాకు మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే యువకుడు ప్రయాణిస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. 
 
మహిళా సిబ్బందిని తాకరాని చోట తాకుతూ వారిని ఇబ్బంది పెట్టాడు. అతడి వెకిలి చేష్టలు భరించలేని తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే వారితోనూ వాగ్వివాదానికి దిగాడు. యువకుడి తీరుతో విసుగు చెందిన విమాన సిబ్బంది అతడిని పట్టుకుని కూర్చున్న సీట్లోనే కట్టిపడేశారు. మాట్లాకుండా నోటికి టేప్ అతికించారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 12.7 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తనను కాపాడాలంటూ యువకుడు అరుస్తున్న మరో వీడియో కూడా వైరల్ అయింది. కాగా, విమానం ల్యాండ్ అయ్యాక విమాన సిబ్బంది యువకుడిని పోలీసులకు అప్పగించారు.